నవతెలంగాణ-హైదరాబాద్ : నెక్సస్ హైదరాబాద్ మాల్ పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా ఆర్మీ బూట్ క్యాంప్‌ను ప్రారంభించింది. ఈ క్యాంప్ ఈనెల 31వ తేదీ వరకు ఉండనుంది. దీనిని యువ రిక్రూట్‌ల కోసం సాహసంతో కూడిన ప్రయాణంగా చెప్పవచ్చు. ఈ క్యాంప్ ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది. ఆర్మీ బూట్ క్యాంప్ పాల్గొనేవారిలో జట్టుకృషి, స్థితిస్థాపకత, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో థ్రిల్లింగ్ కార్యకలాపాలను అందిస్తుంది. రాక్ క్లైంబింగ్ నుంచి ఆర్మ్ రెజ్లింగ్ వరకు, రైఫిల్ షూటింగ్ నుంచి టన్నెల్ క్రాలర్ ద్వారా నావిగేట్ చేయడం వరకు ఉంటుంది. నిజ జీవితంలో సైనిక శిక్షణ సవాళ్లు ఉత్సాహాన్ని అనుసరించేలా రూపొందించబడింది. ఈ ఆర్మీ బూట్ క్యాంప్‌కు హాజరు కావాలనుకునే వారు టికెట్లు తీసుకోవాల్సి ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పిల్లలకు రూ. 199, శని, ఆదివారాలు, పబ్లిక్ సెలవుల్లో ఒక్కొక్కరిక రూ. 299 టికెట్ ధరలు ఉన్నాయి. అయితే, ప్రత్యేక ఆఫర్ కింద రూ. 5,000 షాపింగ్ చేయడం ద్వారా ఒకరికి ఉచిత ప్రవేశం కల్చించనున్నారు. శని, ఆదివారాల్లో సైనిక శిక్షణ, వ్యూహాలకు సంబంధించి వివిధ అంశాలపై మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రత్యేకమైన వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.