కాంగ్రెస్ పార్టీలో చేరిన కడెం రాములు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కడెం రాములు తోపాటు అనుచర వర్గం 20 మంది మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చౌటుప్పల్ మండల పరిషత్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకులు ఇంద్రసేన రెడ్డి మండల అధ్యక్షులు బోయ దేవేందర్ సీనియర్ నాయకులు గుండు మల్లయ్య గౌడ్ డిసిసిబి మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.