చెన్నయ్: ఇసుజు మోటార్స్ ఇండియా కొత్తగా మార్కెట్లోకి లైఫ్‌స్టైల్ పికప్ మోడల్స్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో మరింత ఆకర్షణీయమైన పిక్ అప్ కల్ట్ అవతార్‌లో వి క్రాస్ జెడ్ ప్రెస్టీజ్‌ను పరిచయం చేసినట్లు పేర్కొంది. చెన్నరు ఎక్స్‌షోరూం వద్ద విక్రాస్ జడ్ ప్రారంభ ధరను రూ.25,51,700గా, విక్రాస్ ప్రెస్టిజ్ దరను రూ.26,91,700గా ప్రకటించింది. ఇవి కొండ ప్రాంతాల్లోనూ గంటకు 4-30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని తెలిపింది.