ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక

– నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఒక సిరాచుక్క లక్ష మొదళ్లకు కడలికని సమాచారహక్కు చట్టం రక్షణ వేదిక భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు అన్నారు. గురువారం మండల కేంద్రములో మాట్లాడారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3వ, తేదీన యునెస్కో మొదట నిర్వహించిందన్నారు. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండో హాక్ నగరంలో 1991,ఏప్రిల్ 29 నుండి, మే 3 వరకు నిర్వహించిన సమావేశంలో పత్రికాస్వేచ్చకు సంబంధించిన పలు తీర్మానాలను చేశారని చెప్పారు. స్వేచ్ఛాయుతమైన స్వాతంత్ర మైన ప్రపంచ వ్యాప్తంగా బహుళ జాతులను సమన్వయానికి మాధ్యమంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఆర్థిక అభివృద్ధిని పౌరుల ప్రాథమిక హక్కు అయినా పత్రికా స్వేచ్ఛను పరిఢ విల్లడం అవసరమన్నారు.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవం డిసెంబరు 1993 ప్రకటించింది.ఐక్యరాజ్య సమితి 19 ఆర్టికల్ లో నే ,పత్రికా స్వేచ్ఛను, సంబంధించిన మూలాలను ఇమిడి ఉన్నాయని తెలిపారు.బావ స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛగా అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రపంచంలో పత్రిక పౌరుని ప్రాథమిక హక్కని, ఈ హక్కులను ఇతరులు దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని, జన్మ సొంతం సిద్ధంగా మన రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కులను చర్చించి రాజకీయాల్లోనే పరిపాలన  లోనూ స్వచ్ఛతను విలసిల్లడానికి పరిగెత్తు కాలంలో సమాంతరంగా ప్రజలకు ముంగిటికి వార్తలను అందించే విలేకరులు పత్రికా స్వేచ్ఛ ప్రతి సమాజానికి వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనదన్నారు. దేశంలో కానీ సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించి ఉంటే ఆ సమాజానికి అంధకారంలోకి ,నెట్టిన పత్రికాస్వేచ్ఛ పారదర్శకతను తద్వారా సుపరిపాలన పెంపొందించింది.పత్రికా స్వేచ్ఛను అనుసంధానము చేసే వారధి వంటిదని, జాతుల సంస్కృతులను మధ్య భావ మార్పిడికి వంటి అభివృద్ధి కి, పత్రికాస్వేచ్ఛ తప్పనిసరి , స్వేచ్ఛ, కోసం ,ప్రజల కోసం పత్రికా స్వేచ్ఛ కోసం కృషి చేస్తునన్నారు.