అనుమతులు లేనిదే మట్టి తవ్వకాలు

– పట్టించుకోని సంభందిత శాఖ అదికారులు

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ జీపీ పరదిలోని సిద్దాపూర్ గ్రామ చెరువు నుండి అక్కమ మట్టి తవ్వకాలు అక్రమదారులకు అడ్డగా మారింది. ప్రతి ఎటా మట్టి మాఫియా దారులు రైతుల పేరుతో మట్టిని వేల రూపాయలకు అమ్మకాలు చేసి చెరువులను గుళ్ల చేస్తున్నారు. సంభందిత ఇరిగేషన్ , రివేన్యు శాఖల వారికి సంభంగం ఉన్నప్పడికి పట్టించుకోక పోవడం మండల వాసులలో పలులఅనుమావాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ తంతు కొన సాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక టిప్పర్ దూరం పట్టి రేటు ఫిక్స్ చేసారు అక్రమదారులు, ట్రాక్టర్ల సహయంతో వ్వవసాయ రైతులో క్షేత్రాలలో వేస్తున్నామని నమ్మ బలికి వ్వవహరాలు చక్క బెడుకున్నారు.
పక్కరాష్ట్రాలకు చెరువు మట్టి తరలింపు: బంగారం లాంటి చెరువు నల్ల మట్టిని పక్కనే ఉన్న మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిభందనలు ఉల్లంగిస్తున్న  సంభందిత శాఖలు నిద్ర మత్తు విడటం లేదు.
నిభందనలు: మట్టి తవ్వాలంటే ముందుగా నీటీ పారుదల శాఖకు మట్టి తవ్వకాలు చేస్తామని దరఖాస్తు చేసుకోవాలీ, తదనంతరం రివేన్యు శాఖ చెరువు లోపలి స్థలం పరిశీలించి మట్టి ని త్వకాలకు లోతు, దూరం మెదర్ మెంట్ చేసి హద్దులు పాతిన దాంట్లో నుండి మట్టి తవ్వకాలు సంభందిత ఇరిగేషన్ శాఖ సూపర్ వైజర్ పర్యవేక్షణలో తవ్వకాలు నిర్వహించాలీ. ఎన్ని ట్రిప్పులు తరలించారో వివరాలను రికార్డులో నమేాదు చేయాలీ. కానీ ఇటన్నిటికి తుంగలో తొక్కి అనుమతులు లేకుండానే యదేఛ్చంగా మట్టిని తవ్వకాలు చేసి లక్షల రూపాయల ప్రకృతి సంపదను దోచుకోవడం ప్రజలు అగ్రహిస్తున్నారు. ఇప్పడికైన జిల్లా కలెక్టర్ అక్రమ చెరువు మట్టి తవ్వకాలు చేస్తున్న మాఫీయా పైన చర్యలుృచేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.