– 34 కిలోల బంగారం, 43 కిలోల వెండి స్వాధీనం
– శంషాబాద్లో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో కారులో తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 34కిలోల బంగారం, 43కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో శుక్రవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 34 కిలోల బంగారం, 43 కిలోల వెండి ఆభరణాలను పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీటిని ముంబాయి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఎలక్షన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆభరణాలకు సంబంధించిన ఆధారాలు, తరలింపుపై ఆరా తీస్తున్నారు.