మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి మరియు ముదక్ పల్లి గ్రామాలలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి మరియు మండల అధ్యక్షుడు సాయి రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం రోజున ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వస్తేనే ఉపాధి హామీ బతుకు తెరువుకు గ్యారెంటీ ఏర్పడుతుందన్నారు రోజువారి కూలీ 400కు పెంచుతామన్నారు వేసవిలో 35 శాతం అదనంగా బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని శ్రీమతి సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని , కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ జీవన్ రెడ్డికి ఓటు వేసి మన మోపాల్ మండలం నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని ముప్పగంగా రెడ్డి కోరారు. బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని మన రాష్ట్రాన్ని దివాలా తీసింది కేసీఆర్ కుటుంబమని అటువంటి దౌర్భాగ్య పాలన నుంచి విముక్తి పొందామని ఇంకా ప్రజలు తిరస్కరించిన వారికి బుద్ధి రాలేదని , కారు షెడ్డు కు పోయిందని బిజెపి వాళ్లు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నరే తప్ప అరవింద్ మన మండలానికి చేసింది ఏమీ లేదని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని, రోజు రోజుకు నిరుద్యోగిత పెరుగుతుందని కచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుస్తే భూపతిరెడ్డి తో కలిసి ఇంకా మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో దాదాపు 5 గ్యారంటీలు అమలు చేశామని అతి త్వరలో రుణమాఫీ కూడా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని అతి త్వరలో రుణమాఫీ కూడా సాధ్యమవుతుందని ఆయన తెలిపాడు. ఈ కార్యక్రమంలో గంగా ప్రసాద్, డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ లింగం, ఎంపీటీసీ రాములు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.