కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్నాటి సైదులు గౌడ్

నవతెలంగాణ – చండూరు
మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కర్నాటి సైదులు గౌడ్ శనివారం చండూరులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.