ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షుడుగా బెజ్జనబోయిన ప్రవీణ్

నవతెలంగాణ – తొగుట
ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడుగా బెజ్జనబోయిన ప్రవీణ్ నియమించామని కాంగ్రెస్ పార్టీని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. శనివారం దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో క్రియాశీల కంగా పని చేయాలని సూచించారు. పార్టీలకు యువతనే కీలకమని ఎన్ఎస్యుఐ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపైన నమ్మ కంతో తనకు అవకాశం కల్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రవీణ్ ధన్యవాదములు తెలిపారు.