కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామానికి  చెందిన పలువురు పెద్ద ఎత్తున ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి  ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ నచ్చన్న గారి గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ జెల్ల భూమన్న, గోర్తే చక్రపాణి, నెహ్రూ, కుర్మ రాజేందర్, ప్రతాప్, నర్సయ్య మరో 100మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, టక్కరి గంగాధర్, నర్సారెడ్డి, నాని, చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.