– పెద్ద నోట్ల రద్దుతో పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు..
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎర్రజెండా పక్షాన పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కొడవలి నక్షత్రం గుర్తు పై ఓటు వేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతోన్మాద బీజేపీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కులం పేరుతో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మాయ మాటలు చెప్పి బీజేపీ ప్రభుత్వం మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు. మోడీ ప్రభుత్వం అచ్చేదిన్ అని ప్రచారం చేసి పేద ప్రజల నడ్డి విరిచ విధంగా రేట్లు పెంచి ప్రజలను ఆర్థికంగా దెబ్బతీశారని మండిపడ్డారు . కొట్లాడి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా కొత్త కొత్త చట్టాలను తెచ్చి పేద ప్రజల కడుపును కొట్టి కార్పోరేట్ శక్తులకు కుమ్ము కాసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక కుటుంబానికి కూడా రూ.15 లక్షల నగదును ఇవ్వలేదని అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు నల్లధనమును తెల్లదనం గా మార్చుకునే అవకాశం కల్పించాలి తప్ప పెద్ద నోట్ల రద్దుతో పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని అన్నారు.
రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న మేలును బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక రాజ్యాంగం ను మార్చి మనువాద సిద్ధాంతంతో పాలించాలని బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరలేపిందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేలుకొని మతోన్మాద బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అనునిత్యం ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ అన్యాయం జరిగిన వారికి అండగా ఉండి పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, మండల కార్యదర్శి మిరియాల భరత్, గొర్ల మేకల సంఘం జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, యాట యాదయ్య, బొల్లు రవీందర్ కుమార్, పోలే సత్యనారాయణ, ఎండి సిద్ధిక్, యాట శ్రీకాంత్, యాస రాణి వంశీకృష్ణ, భీమనపల్లి రాంబాబు, వినోద్ నాయక్, సైదా నాయక్, శ్రీను నాయక్, రామారావు , వీరన్న, రాజు, కోటి, లింగయ్య తదితరులు ఉన్నారు.