
పది సంవత్సరాలు నిరంకుశ పాలనలో విసిగి వేసారి పోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజాపాలన అందుతుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మోరిపిరాల, ఆర్అండ్ఆర్ కాలనీ, పన్యా నాయక్ తండా, కిష్టపురం, వాంకుడొత్ తండా, పోతిరెడ్డి పల్లి, ఉకల్, పెర్కవేడు గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గడిలా పాలన చేపడితే బీజేపీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోంది అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో పేదలకు ఇళ్లు, మంచి చదువులు, పథకాల అమలులో రాజీపడే సమస్యే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దొరలపాలెంలో కొనసాగిందని గొప్పలు చెప్పడమే తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రభంజనంతో గెలిచే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పథకాలను తీసుకువచ్చి 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని, మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సత్తా చాటుతుందన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లి ప్రతి ఒక్కరి చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అమ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, భాస్కర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.