
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైల్వే పోలీస్ (ఆర్పిఏప్) కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్-2024 ఆన్లైన్ అప్లికేషన్స్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ కరే ఆదేశాల మేరకు, ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా జారీ చేయబడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (4208 ఖాళీలు), సబ్ ఇన్స్పెక్టర్ (452 ఖాళీలు) ఉద్యోగ నియామకపు నోటిఫికేషన్ కు సంబంధించి ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులకు కాటారం పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ అప్లై చేస్తున్నామని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి పదవ తరగతి / డిగ్రీ పూర్తి చేసిన యువతి యువకులు సంబంధిత విద్య అర్హత, కులం సర్టిఫికెట్స్, తెలుపు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ తో కాటారం డీఎస్పి కార్యాలయంలో సంప్రదిస్తే అప్లై చేస్తామన్నారు. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటే ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తామని డిఎస్పి తెలియజేశారు.ఈనెల 14వ తేదీ వరకు అప్లికేషన్ చివరి గడువు ఉన్నందున ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.