సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌

నవతెలంగాణ – పెద్దవూర
ఫెమిలైజేషన్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా లోక్ సభ ఎన్నికల సందర్బంగా స్పెషల్ ఆర్మూడు ఫోర్స్, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో ఆదివారం రాత్రి మండలం లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన చలకుర్తి లో మరియు ఇతర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ ఫ్లాగ్‌ మార్చ్‌లో రాపిడ్‌యాక్షన్‌ఫోర్స్‌ బలగాలతో పాటు స్థానిక పోలీసులు, స్పెషల్‌ యాక్షన్‌ టీం పోలీసులు పాల్గొన్నారు.ఈసందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు ముందుగానే సమస్యాత్మ క పోలింగ్ కేంద్రాలలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించామని తెలిపారు.ప్రజలు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాగర్ సీఐ బీసన్న,ఎస్సైలు వీరబాబు,సంపత్, సిబ్బంది హరిలాల్,సైదిరెడ్డి యాదగిరి  పాల్గొన్నారు.