పేదలకు అండా కాంగ్రెస్ జెండా

– పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండలం సోమవారంమండల కాంగ్రెస్ నాయకులతోకలిసి మండలంలోని అంజనీ, శివ్వాపూర్, తలాబ్ తండా, చావ్ నీ తండా లలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని,ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ,చేతి గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.మన ఎమ్మెల్ల్యే తోట లక్ష్మీ కాంతారావు,ఎంపి అభ్యర్థి సురేష్ శెట్కార్ ల సహాకారంతో మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ మచ్చలేని నాయకుడని ఆయన తెలిపారు.శెట్కార్ కుటుంబం తరతరాలుగా ప్రజాసేవలో ఉందని తెలిపారు.బీజేపీ అభ్యర్థి బిబిపాటిల్ అవకాశవాది అని,పదేండ్లు బిఆర్ ఎస్ పార్టీ తరపున ఎంపి గా ఉండి ప్రజలకు ఎలాంటి సేవచేయలేదని తెలిపారు.బిఆర్ఎస్ పుట్టి ముంచి  బిబి పాటిల్ బిజెపిలో చేరాడని ఈ ఎన్నికల్లో ఆయనను బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లప్పపటేల్,నాగిరెడ్డి,శ్యామప్ప,మోహన్,పండరి, సంజీవ్,శ్రీనివాస్,చప్టేనాగు,రషీద్,సాయగౌడ్, తదితరులు పాల్గొన్నారు.