బహుజన సమాజ్ పార్టీ మందల అధ్యక్షుడిగా నక్క మహేష్

నవతెలంగాణ – మల్హర్ రావు
బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడుగా మండలంలోని  పెద్దతూండ్ల గ్రామానికి చెందిన నక్క మహేష్ ను నియమించడం జరిగిందని మంథని నియోజకవర్గ ఇంఛార్జి జనగామ రవి కుమార్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంథని నియోజక వర్గ ఇంఛార్జి జనగామ రవికుమార్ కోశాదికారి పులిపాక బొంద్యాలు మంథని రాజు లకు మహేష్  ప్రత్యెక కృతఙ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, పెద్దపల్లి ఎంపీ బిఎస్పీ అభ్యర్థి విజయానికి తన వంతుగా కృషి చేయునట్లుగా తెలిపారు.