
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర బార్డర్ ప్రాంతంలో మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ సరిహద్దు చెక్‌పోస్టును సోమవారం నాడు జహీరాబాద్ పార్లమెంట్ జుక్కల్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి సందర్శించి తనిఖీ నిర్వహించారు. తనిఖీ చెక్‌పోస్టులో రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యూటీ అధికారులకు ఆదేశాలిస్తూ తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ తనిఖీ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంట మద్నూర్ తాసిల్దార్ ఎండి మూజిక్ పాల్గొన్నారు.