– బహుజనుల రాజ్యాధికారంతోనే ప్రజలకు న్యాయం
– బీఎస్పీ మహుబాద్ పార్లమెంటు అభ్యర్థి కోనేటి సుజాత
నవతెలంగాణ – నెల్లికుదురు
బహుజనుల రాజ్యాధికారంతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగ రక్షణకే బీఎస్పీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మహబూబాబాద్ పార్లమెంటు ఆ పార్టీ అభ్యర్థి కోనేటి సుజాత అన్నారు. మండల కేంద్రం ,శ్రీరామగిరి, ఎర్రబెల్లి గూడెం, గ్రామాలలో సోమవారం అభ్యర్థిని గెలిపించాలని పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బి ఆర్ స్ లాను గే లిపించినా కూడా వారు బీజేపీ లోకి వెళ్తున్నారని అయితే బి జె పీ అంతిమ నిర్ణయం రాజ్యాంగo ను రద్దు చేయడమేనని అన్నారు దీని వలన బహుజన సమాజం మళ్ళీ బానిస సమాజంగా మారే ప్రమాదం వుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఎంతోమంది ఉన్నామని గుర్తించిన దాఖలు లేవని అన్నారు ఎరకల కుటుంబంలో పుట్టి ఎస్టి కులస్తుల ఎంతోమంది ఉన్నామని ఏ ప్రభుత్వాలు కూడా మా ఎరుకల ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పార్లమెంటుగా అభ్యర్థి గాని ఒక అసెంబ్లీ అభ్యర్థులను గాని బీఫామ్ ఇచ్చి గెలిపించిన దాకా లేవని అన్నారు. స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ కనీసం మా కులస్తులను గుర్తించి మేము చదువుకున్న చదువులకు సరిపడా ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులుగా ఉండి ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వంప మండిపడ్డారు. కనీసం మా సామాజిక వర్గానికి చెందిన వారిని ఊరు బయట ఉంచి అభివృద్ధికి ఆమడ దూరంలో గత ప్రభుత్వాలు ఉంచాలని అన్నారు. ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలంటే మన ఐక్యత అవసరమని మన అభ్యర్థులను పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో మన సత్తా చాటాల్సిన సమయం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ బి.ఎస్.పి అభ్యర్థి కోనేటి సుజాత ఏనుగు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్ ఇంచార్జీ దార్ల శివరాజ్, జిల్లా అధ్యక్షులు ఈసంపెళ్లి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీను , ఈసీ మెంబర్ తప్పీట్ల చాణక్య, గాజుల నవీన్ ఆరేపెళ్లి రాంబాబు, ఇ నవిన్ తదితరులు పాల్గొన్నారు.