హేయమైన చర్య … కఠిన చర్యలు తీసుకోవాలి

– కోరుట్ల ప్రభుత్వాస్పత్రి ఘటనపై వైద్య, నర్సింగ్‌ సంఘాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిపై రోగి బంధువులు దాడి చేసి, డీజీల్‌ పోసి హత్యా ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని పలు వైద్య, నర్సింగ్‌ సంఘాలు ఖండించాయి. ఈ మేరకు సోమవారం తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌, తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోస ియేషన్‌ (టీ-జూడా), హెల్త్‌ కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. దాడి చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలనీ టీ జూడా డిమాండ్‌ చేసింది. ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌డీఏ కోరింది. ఇలాంటి ఘటనలతో వైద్యులు, వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతిం టున్నదని తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.