కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుపించాలి

– బీఆర్ఎస్ మండల నాయకులు  భూతరాజు వెంకన్న 
నవతెలంగాణ – చండూరు
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని  బిఆర్ఎస్ మండల నాయకులు భూతరాజు  వెంకన్న    అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో   స్థాని క బీఆర్ఎస్ నాయకులతో కలిసి 3,9 వార్డులలో ఇంటింటా ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్   నిస్వార్థపరుడని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పే  వ్యక్తి అన్నారు.రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ హవా మొదలైందని పార్లమెంట్ గడ్డపై బీఆర్ఎస్ జండా ఎగరవేస్తామని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా, నరేష్ తోట వినోద్ చారి, కొనియాల మల్లికార్జున్ చెరుపల్లి మల్లేష్, సంగెపు రాజు, రాపోలు  వెంకటేశం, నాగా చారి, తదితరులు పాల్గొన్నారు.