ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి: సీపీఐ(ఎం), కాంగ్రెస్ పిలుపు

నవతెలంగాణ – గోవిందరావుపేట
పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలం లోని పసర గ్రామంలోని సీపీఐ(ఎం) పార్టీ ఆఫీసు నందు కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ఇండియా కుటమీ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోరిక బలరాం నాయక్ పోటీ చేయడం జరిగిందని ఇండియా కూటమి అభ్యర్థి గెలిపించాలని సీపీఐ(ఎం), కాంగ్రెస్ కూటములు కలిసి పనిచేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మేనేజిమెంట్ ఎన్నికల ఇన్చార్జి కత్తి వెంకటస్వామిలు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. దేశంలో గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పేదలపై పెనుభారాలు మోపుతూ రైతులపై నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ నీధులు తగ్గించి నిరుద్యోగాన్ని పెంచి  ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పనంగా ప్రైవేటు వారికి అప్పగించి బీజేపీ ప్రభుత్వం అంబానీ ఆదానీలకు ఊడిగం చేస్తుందని బీజేపీ మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే సెక్యులర్ అనే పదాన్ని తొలగించి మతతత్వ రాజ్యాన్ని స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి దేశంలో మత కల్లోలాలు సృష్టించి మతపరమైన దేశంగా మార్చే అవకాశం ఉందని దేశంలో స్వేచ్ఛ స్వతంత్రం లు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని, ఈ దేశాన్ని కాపాడటం కోసమే దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు చేసి దేశాన్ని రక్షించండి, బీజేపీని ఓడించండి అనే నినాదంతో ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుందని, కావున ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, పొదిలి చిట్టిబాబు మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనేజమెంట్ సభ్యులు సూరపనేని నాగేశ్వరావు, మండల నాయకులు గుండు రామస్వామి, అంబాల మురళి, కడారి నాగరాజు, క్యాతం సూర్యనారాయణ, ముమ్మడి ఉపేంద్ర చారి, పిట్టల అరుణ్  తదితరులు పాల్గొనడం జరిగింది.