
– యువకుడు పట్నం రమేశ్ ప్రయత్నం..
– సద్వినియోగం చేసుకోవాలని సూచన
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రానికి చెందిన యువకుడు పట్నం రమేశ్ గొప్ప సంకల్పంతో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు. మంగళవారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల తరగత గదిలో అధికారుల అనుమతులు తీసుకుని శిక్షణ తరగతులను కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభించాడు.భవిష్యత్తులో విద్యార్థులు రాణించేందుకు ఇంగ్లీషుభాష ప్రాధాన్యత సంతరించుకుంది.ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థుల సద్వినియోగం చేసుకునేల తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని యువకుడు పట్నం రమేశ్ సూచించారు.తన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే గొప్ప సంకల్పంతో వేసవి సెలవు రోజుల్లో ఉచిత ఇంగ్లీషుభాష పటుత్వంపై శిక్షణ తరగతులు ఏర్పాటుచేయడం ఆనందనయమని మండల కేంద్రంలో పలువురు అభినందనలు తెలిపారు.