ఇంటర్ పాస్ అయిన  విద్యార్థులూ..అశ్వారావుపేట డిగ్రీ కళాశాలలో దోస్త్ కు దరఖాస్తు చేసుకోండి..

Oplus_0

– ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్.

నవతెలంగాణ – అశ్వారావుపేట
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ) ఆన్ దరఖాస్తు విధానం ఈ 6 తేదీ నుండి 25 వరకు ప్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉన్నందున అశ్వారావుపేట పరిసర ప్రాంత ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్ధులు అశ్వారావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే.విజయ కుమార్ విద్యార్ధులను కోరారు. ఆయన స్థానిక ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం ఈ విద్యాసంవత్సరం క్యాంపెయిన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ..ఈ నెల 15 వ తేదీ నుండి 27 వ తేది వరకు వెబ్ ఆప్షన్ సదుపాయం ఉంటుంది అని అన్నారు. జూన్ 03 వ తేదీన ఉన్నత విద్యా మండళి సీట్లు కేటాయిస్తుందని తెలిపారు. దోస్త్ వెబ్ సైట్,మీ సేవ,యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల మాధ్యమం (ఇంగ్లీష్ మీడియం) లో బీ ఏ (హెచ్.ఈ.పి.ఎస్,హెచ్.ఈ.సీ.ఏ),బీకాం (సీఏ),బీఎస్సీ (బీ.జెడ్.సీ),బీఎస్సీ (ఎం.పీ.సీ,ఎం.పీ.సీ.ఎస్,ఎం.సీ.ఎస్) గ్రూపుల్లో విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంత ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ పి.రామచంద్రరావు,శ్రీనివాస్ రావు,క్రిష్ణా రావు,బంగారి లు పాల్గొన్నారు.