ఘనంగా అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మాణిక్ బండార్ తండాలో  మంగళవారం అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతినీ ఏఐకేఎంఎస్ అధ్వర్యంలో ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి గిరిజనులకు హరితహారం పేరిట భూములు ప్రభుత్వం గుంజుకుంటున్నారు ఆదివాసులకు 9 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరిట బడబడ కార్పొరేట్  శక్తులకు భూములు అప్పజెప్తున్నారని మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు కలలు పూర్తి కావాలంటే మరో స్వతంత్ర పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసి గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాలలో కుబింగు దాడులు నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏఐకేఎంఎస్ అబ్బయ్య, మాలవత్ గంగాధర్, నాయుమ్, లక్ష్మణ్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.