రైతులపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లది కపట ప్రేమే :మంత్రి పొన్నం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రైతులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తే ఆయా పార్టీలకు చెందిన నేతలు ఓర్వలేకపోయారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు భరోసా నిదులను విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం భావిస్తుంటే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీలు దాన్ని అడ్డుకున్నాయని విమర్శించారు. రైతు భరోసాను ఆపాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయనీ, దీంతో రైతు ఖాతాల్లో డబ్బులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు..