
ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ సెట్కార్ గెలిపే ధ్యేయంగా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అంటూ ప్రజలకు పథకాల గురించి వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి సురేష్ సెట్కార్ ను ఎంపిగా గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో ప్రజలను నాయకులు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముమ్మర ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు వట్నాల రమేష్ ఎంపీటీసీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ యువ నాయకులు రచ్చ కుశాల్ థైదల్ రవి అవార్ హనుమాన్లు కర్ల సాయిలు బండి గోపి బండి లక్ష్మణ్ బాలు యాదవ్ ఐన్లవార్ హనుమాన్లు సాయిన్వార్ భారత్ విట్టల్ అనిల్ మారుతి తదితరులు పాల్గొన్నారు.