చామలను గెలిపించాలని ముమ్మర ప్రచారం..

నవతెలంగాణ – భువనగిరి కలక్టరేట్ 

భువనగిరి మండలం గౌస్ నగర్ గ్రామంలో  భువనగిరి పార్లమెంటు అభ్యర్థి  చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు గౌస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు గడసందుల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌస్ నగర్ మాజీ ఉపసర్పంచ్ పాక వెంకటేష్ యాదవ్ హాజరై,  మాట్లాడారు. దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడకుండా చేసిన ప్రాణ త్యాగం చేసిన శ్రీమతి ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగిందనీ , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను ప్రవేశపెట్టి గ్రామాలలో ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనీ  గౌస్ నగర్ గ్రామ ప్రజలందరూ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిరిక మల్లారెడ్డి,  యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు గడసందుల హరీష్, పల్లెర్ల మహేందర్ , పీర్ల భాస్కర్ , ఈర్ల వెంకటేశం, గడసందుల బిక్షపతి, కొమ్ము శంకరయ్య లు పాల్గొన్నారు.