రైతందానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం..

నవతెలంగాణ – మునుగోడు
రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీ ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న జరుగు పార్లమెంట్ ఎన్నికల్లో రైతాంగం బీజేపీ ని ఓడించేందుకు  సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) అఖిల భారత నాయకులు,  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్జ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్గురి నరసింహ కోరారు. బుధవారం  మండల కేంద్రంలో సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన  సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న ఈ పది సంవత్సరాల కాలంలో రైతులు, వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు 4.26 లక్షల మంది. ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకున్నది. కరోన కాలంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిగింది. 750 మంది రైతులు ప్రాణాలు బలిదానం చేశారు. ఫలితంగా 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం. దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతోపాటు కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, రుణమాఫీ చేస్తానని, విద్యుత్ సవరణ బిల్లును రైతులతో మాట్లాడకుండా పార్లమెంట్లో పెట్టనని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తానని, ఫనల్ భీమా యోజన రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చింది.
ఈ రెండు సంవత్సరాల కాలంలో హామీలను అమలు చేయకపోగా వ్యవసాయరంగాన్ని ఐదా కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్నది. పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత పెట్టింది. రైతుల ఆత్మహత్యలకు కారణమైన అప్పుల మాఫీకి పూనుకోలేదు. బడా కార్పోరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. కనీస మద్దతు ధరల చట్టం ఊసే లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న హామీని తుంగలో తొక్కింది. ఈ కాలంలోనే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకపోగా అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారని అన్నారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు సురిగిచలపతి , సిపిఐ మండల కార్యదర్శి చాపల శీను , ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న , సిపిఎం మండల నాయకులు యాసరాణి శీను,  వేముల లింగస్వామి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బండారి శంకర్  తదితరనాయకులు పాల్గొన్నారు.