వెంకట్రామిరెడ్డి ని బారి మెజారిటీ గెలుపించాలి

నవతెలంగాణ – తొగుట
వెంకట్రామిరెడ్డి ని బారి మెజారిటీ గెలుపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం మండ లం లోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా ఐకెపి వడ్ల కొనుగో లు కేంద్రం వద్ద అమాలి కార్మికులకు, రైతులను ఓటు వేయాలని కోరారు. అమాలి కార్మికులు, రైతు లు కారు గుర్తుకు ఓటు వేస్తామని తెలుపడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నందా రం వెంకటేష్ గౌడ్,  ఎంపీటీసీ వేల్పుల స్వామి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి. కలిముద్దీన్,  బూత్ అధ్యక్షులు మన్నే కనకరాజు, గ్రామ ఉపాధ్య క్షులు బుర్ర ఎల్లా గౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే బాలరాజ్, సీనియర్ నాయకులు గడ్డమీద నారాయణ, భీమ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, భీమిరెడ్డి, శ్రీని వాస్ రెడ్డి, ఎండి షరీఫ్, అన్వర్, వార్డ్ సభ్యులు గౌస్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.