ఐక్యతంఐనైక్యతొకులం

ఎక్కడైన ఎప్పుడైన
ఆధిపత్య కులాలలో ఒకడు తప్పుజేస్తే
అతడిని తప్పించడానికి
కింద నుండి పైదాకా
అందరూ ఏకమై
తల్లికోడికింద పిల్లల్ల కాపాడుకుంటరు
ఇదీ వాళ్ల ఐక్యతకు చిహ్నం.

కింది కులాలలో
ఎవరిమీదనైన నిందమోపబడితే
మన కింది కులాల పెద్దలంత
రాబందులై ఎగబడి
ఆ బక్క జీవిని శిక్షించి
లోలోపల సంతోషపడతారు
ఇది మన ఐనైక్యతకు బండగుర్తు.

ఈ నేలమీద
పిడికెడున్న జనమే
పిడికిలిలా బలంగా ఉంటరనేది
ఓ చారిత్రక సత్యం.

ఇక్కడ జాతుల సంఖ్యాబలం
ఎక్కువుండడం మంచిదే
ఐతే సదరు గుంపంత గంపగుత్తగా
విడిపడి ఉండటం
ఓ సామాజిక నేరం.
– అవనిశ్రీ, 9985419424