కేసీఆర్ హాయంలో తెలంగాణ రాష్ట్ర ఎంతో అభివృద్ధి చెందింది 

– చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం  
నవతెలంగాణ – చండూరు  
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హాయంలో తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెంది రాష్ట్రంగా ఏర్పాటు అయిందని చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం  అన్నారు. గురువారం  గట్టుపల్ మండల కేంద్రంలో భాగంగా 188,189   బూతులలో ముమ్మరంగా   ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా బలోపేతం చేయాలనే గొప్ప సంకల్పంతో బిఆర్ఎస్  ప్రభుత్వం  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసిందని అన్నారు. వ్యవసాయం చేసే రైతులు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడకుండా ప్రతి ఏడాది రెండు విడతల రైతుబంధు ఎకరానికి రూ.5000 ఇచ్చి రైతు బాంధవుడుగా రైతులను ఆదుకున్నారని అన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి  నాలుగు నెలలు కావస్తున్న రైతు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ చెప్తున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి చామ మల్లేష్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  చిలుకూరి అంజయ్య, తిరందాస్ ఆనంద్ , దోర్నాల అమరేందర్ , మోద్గు శంకర్ రెడ్డి, కర్నాటి అబ్బయ్య, భీమగాని యాదయ్య, జెల్ల అంజయ్య, కర్నాటి వెంకటేశం, నారని జగన్,జూలూరి పురుషోత్తం, పెదగాని శ్రీను, పున్న ఆనంద్ , నేలంటి వెంకటేశం. తదితరులు పాల్గొన్నారు.