పలు ఆలయాల్లో దొంగతనం..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో పలులయల్లో, అలుర్ మండలంలోని డికంపల్లి గ్రామంలోని ఆలయంలో బుదవారం అర్థరాత్రి దొగలు పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ, బిమయ్య, పెద్దమ్మ ఆలయంలో తాళం పగుల గొట్టి ఎల్లమ్మ ముక్కు పుడక అరతులం వెండిది, ఇత్తడి తాంబూలం, పెద్దమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తెల తాడు నాలుగు మాసాలు బంగారం, కండ్లు మాసం వెండి, ఉండిలోని డబ్బులు దొంగలించారు. భీమన్న గుడిలో ఏమి దొరుకలేవు. ఆలూరు మండలంలోని డికంపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో పుస్తెలు దొంగలించరని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించారు.