కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదికి చల్మెడ సవాల్..

– మీకు వచ్చిన ఓట్లు …మీ అభ్యర్థికి రావాలే..
– పార్లమెంట్ అభివృద్ధికి నిధులు అడగని అసమర్థుడు బండి..
– బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు..
నవతెలంగాణ – వేములవాడ 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సాధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి కూడా రావాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి  చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో 72 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థికి కూడా ఇదే స్థాయిలో ఓట్లు తీసుకువచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ సైనికుడని నిరూపించుకోవాలని చల్మెడ సవాల్ విసిరారు.  కాంగ్రెస్, బిజెపి ఒకటయ్యారు అనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే ఓట్ల ద్వారా తేలిపోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని 6 గ్యారంటీలు అమలు చేయడం వల్ల విఫలం కాగా ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఉద్దెర పథకాలు గృహ జ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసి చేతులు దులుపు కో గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు మరోసారి తప్పు తెలుసుకున్నామని పశ్చాత్తాప పడుతున్నారని వెల్లడించారు. రైతులకు కరెంటు నీళ్లు ఇవ్వకపోగా రైతు భరోసా అమలు కావడం లేదని కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు మాత్రమే అమలు అవుతుందని అన్నారు. ఇంతకాలం ఆపి మళ్లీ ఇప్పుడు రైతుబంధు వేశాడని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వేస్తామన్నప్పుడు అభ్యంతరం తెలిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చి వాళ్ళ దాంట్లో నుంచే ఒకరి ద్వారా ఫిర్యాదు చేయించి మళ్లీ ఆపించాడని ఆరోపించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాలుగా కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశానని చెప్తున్నారని కొట్లాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆది శ్రీనివాస్ కట్టుబడి ఉన్నాడా ప్రజలకు తెలిపాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 రుణమాఫీ కూడా ఉత్తముచటేనని విమర్శించారు. ఇక దక్షిణ భారతదేశంలో ఆదాయాన్ని ఉత్తర భారత దేశంలో ఖర్చు పెడుతున్న ప్రధాని మోదీ మొదటి నుండి దక్షిణ భారతదేశ మీద వివక్షతే చూపుతున్నారన్నారు అని విమర్శించారు. దక్షిణ కాశీ రాజన్న ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శించుకున్న మోడీ అభివృద్ధికి మాత్రం ఒక రూపాయి కేటాయించకపోవడమే ఎందుకు నిదర్శనం అన్నారు. ప్రధాని హోదాలో మోడీ వస్తే కనీసం అభివృద్ధికి నిధులు అడిగే సమర్ధత లేని అసమర్ధుడు బండి సంజయ్ అని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ జిల్లాకు అనేక  అభివృద్ధి నిధులు సాధించిన విద్యావేత్తగా మరోసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను గెలిపించుకుందామని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అభివృద్ధి  పరిధిలోని సమస్యల గళం విప్పే నాయకుడు వినోద్ కుమార్ అని ప్రతి ఒక్కరూ వినోద్ సమస్యల గళం విప్పే నాయకుడు వినోద్ కుమార్ అని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈనెల 10వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉన్నందున పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
పదో తరగతికి రెండో పేపర్ లేదు..
పదో తరగతిలో మొదటి పేపర్ ఆది శ్రీనివాస్ పాస్ అయినట్లుగానే రెండవ పేపర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గెలిపించాలని వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను చల్మెడ లక్ష్మీనరసింహారావు తిప్పి కొట్టారు. రెండు సంవత్సరాల క్రితమే పదవ తరగతి పేపర్లను ఒకటికి కుదించారని చెబుతూ ఒకటి మాత్రమే పాసయ్యారని మరొకటి మీకు అవకాశం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి,  పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేశ్, నాయకులు ఏశ తిరుపతి, గడ్డం హనుమాన్లు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రామతీర్థపు రాజు, పైడి శ్రీనివాస్, కొండ కనుకయ్య,  కమలాకర్ రెడ్డి, ప్రేమ్ చారి, అఫ్రొజ్, భాస్కర్, సందీప్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.