నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
రబి 2023 -24 సంవత్సరా నికి సంబంధించి 48,437 మంది రైతుల దగ్గర నుంచి 3,00,233 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి, 584.44 కోట్ల ను రైతుల ఖాతాలో నేరుగా జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ల ఆదేశానుసారం గురువారం డీఎస్ఓ కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రైస్ మిల్లర్స్, సివిల్ సప్లై మేనేజర్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్ఓ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైసు నిమిత్తం జిల్లాకు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ని రైస్ మిల్లర్స్ అందరూ కూడా విధిగా ప్రతిరోజు వారి టార్గెట్ ప్రకారం ప్రభుత్వం గడువులోపు పూర్తి చేయలని ఆదేశించారు. మిల్లర్లు పెట్టేటటువంటి బాయిల్ రైస్ కి కాళీ స్థలాలు చూయించాలని ఎఫ్సిఐ మేనేజర్ ను కోరారు.