నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టెంకాయలు కొడుతూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో సంతోష్ శివాజీ అప్ప హనుమంతు అప్ప లింగాయత్ సమాజ్ పెద్దలు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.