చామల కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి 

నవతెలంగాణ – చండూరు  
చామల కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని శుక్రవారం చండూరులో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి ప్రచారం భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మునుగోడు శాసనసభ్యులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పిలుపుమేరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం చండూర్ మునిసిపాలిటీ లోని 206 బూతులో మాజీ సర్పంచ్, మాజీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కోడిగిరి బాబు  మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే పథకాల గురుంచి, చేస్తున్నటువంటి అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరిస్తూ, చామలా కిరణ్ కుమార్ రెడ్డి  3వ సింబల్ పై ఓటును వేయాలని ఓట్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు గారు, 6వ వార్డ్ కౌన్సిలర్ కోన్ రెడ్డి యాదయ్య, కాంగ్రెస్ నాయకులు రావిరాల రాజేంద్రప్రసాద్, సాధక్, జూలూరు వెంకటేష్, జూలూరు మల్లేష్, ప్రభాకర్, మేడిపల్లి లక్ష్మణ్, గుండు సంతోష్, చెరుపల్లి సాయిరాం,సంగిశెట్టి సాయి, బూతు సభ్యులు పాల్గొన్నారు.