సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ ను గెలిపించాలి..

– నో పెన్షన్ .. నో నోటు..
– తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ లింగా అరుణ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగా అరుణ కోరారు. శుక్రవారం వారు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధతో కలిసి భువనగిరి పట్టణంలో సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లింగా అరుణ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి, రైతాంగ వ్యతిరేక ఉద్యోగ పెన్షనర్ల సీనియర్ సిటిజన్లో వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసిన బీజేపీకి నో పెన్షన్ … నో ఓటు అని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించిన, వాటి అమలును కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం  అడ్డుకుంటుందని ఈపీఎస్ పెన్షనర్స్  పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆరోపించారు. 2016 సంవత్సరంలో హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేయకుండా రివ్యూ పిటిషన్ ద్వారా 2014 కన్నా ముందు రిటైర్ అయిన వారికి ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని తిరస్కరించిందని, 2013లో మనధర్మ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ జవదేకర్ బిజెపి అధికారంలోకి వస్తే భగత్ సింగ్ కోష్యారీ కమిటీ  రిపోర్ట్ మేరకు డిఏ తో కూడిన 3 కనీస పెన్షన్ అమలు చేస్తామని వాగ్దానం చేశారని అమలు చేయలేదన్నారు. ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9000 పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ ఇవ్వాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ బదులు ఓల్డ్ పెన్షన్ అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఫ్రీజ్ చేసిన డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని, సీనియర్ సిటిజెన్లకు రద్దు చేసిన రైల్వే ప్రయాణ రైతులకు పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నాయకులు  బందేల ఎల్లయ్య, బోడ భాగ్య, కల్లూరి నాగమణి, నరసమ్మ, లలిత, మర్రన్న, లక్షమయ్య , నరేష్, బి మల్లేష్ లు పాల్గొన్నారు.