నవతెలంగాణ-ముత్తారం: ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వైస్ ఎంపిపి సుదాటి రవీందర్ రావు ప్రజ లను కోరారు. ఈ మేరకు ముత్తారం మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈ శ్వర్ కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్క తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముత్తారం గ్రామ శాఖ అధ్యక్షులు అలువోజు రవీందర్ చారి, చల్ల రాజేందర్, తుండ్ల చందు, గుడి శ్రీనివాస్, అలువోజు మహేందర్, అనుము చంద్రు, రాగుల రవీందర్, రాగుల రాజేశం, కలవైన బాలమల్లు, తూటి లచ్చయ్య, అమ్ము కుమార్, కాట్ల సమ్మయ్య, చింతల శ్రీనివాస్, తాత తిరుపతి, అల్లం రాజయ్య తదితరులున్నారు.