నేను బాగా చదివి ఐపీఎస్ ను అవుతాను..!

నవతెలంగాణ పెద్దవూర
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అనుముల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రమ్యశ్రీ అనే విద్యార్థిని పదవ తరగతి లో 10 కీ 10 జీపీఏసాధించింది. ఈసందర్బంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి విద్యార్థిని ఇంటికి వెళ్లి పదవ తరగతి లో 10 కీ 10 జీపీఏ సాదించావు. భవిష్యత్తులో బాగా చదివి ఏమవ్వాలను కుంటున్నావు ప్రశ్నించిగా నేను ఐపీఎస్ కావాలను కుంటున్నాను అని సమాధానం ఇచ్చింది.దాంతో ఆవిద్యార్థినిని ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, ఇస్రం లింగస్వామి, గజ్జల శివానంద రెడ్డి, పొలోజు రమేష్ చారి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.