కాంగ్రెస్ పార్టీలో చేరిన బండి రాజయ్య

– సాధారణంగా ఆహ్వానించిన మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల అధికారప్రతినిది,మంథని మార్కెట్ మాజీ డైరెక్టర్, కాళేశ్వరం మాజీ డైరెక్టర్ బండి రాజయ్య, బిఎస్పీ నాయకుడు రాగం ఐలయ్య యాదవ్, యువ నాయకుడు బండి రణదీర్ రావు తోపాటు పలువురు శనివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాను సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని సాధారణంగా ఆహ్వానించారు. రాజయ్య ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు, ప్రస్తుత మంత్రి శ్రీదర్ బాబు లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో గతంలో 30 ఏళ్ళుగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో పాల్గొన్నారు. అనివార్య కారణాల వల్ల మళ్ళీ సొంత గూటికి చేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు, గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య,బండి స్వామి, ఇందారపు చెంద్రయ్య, దన్నపనేని సురేష్ రావు, బొబ్బిలి రాజు గౌడ్, ఆర్ని ఉదయ్, బొబ్బిలి నరేశ్, ఇందారపు ప్రభాకర్, ఆకాష్, గణేష్, సృజన్ పాల్గొన్నారు.