బీఎస్పీని గెలిపించాలంటూ ప్రచారం..

నవతెలంగాణ-బెజ్జంకి 
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బీఎస్పీతోనే సాధ్యమవుతుందని కరీంనగర్ పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థి మారపెల్లి మొగులయ్యకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి నిషాని సురేశ్ ప్రజలను కోరారు. శనివారం మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో ఉపాధి హమీ కూలీల వద్ద బీఎస్పీ కరపత్రాలతో నిషాని సురేశ్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ బీఎస్పీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. జేరిపోతుల శ్రీకాంత్, చరణ్, మహేష్, రాజేష్, సురేష్, రాజు పాల్గొన్నారు.