యోగా తెచ్చిన తంటా!
రాణికి చిన్నప్పటి నుంచి చేతి గోళ్లు కొరకడం అలవాటు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఆ అలవాటు మానుకోలేదు. దీంతో ట్రీట్మెంట్ కోసం ఆమెను ఓ యోగా గురువు దగ్గర చేర్చారు. అద్భుతం… రాణి ఇప్పుడు చేతి వేళ్లనే కాదు.. కాళ్ల వేళ్లను కూడా కొరకగలుగుతోంది. రాణి రాక్స్.. పేరెంట్స్ షాక్స్! ధాంక్యూ ‘యోగా డే’!!
బ్యాంకుల ప్రత్యేకత
కస్టమర్: మీ బ్యాంకుకు ఇండియాలోనే కాకుండా, దేశం బయట కూడా కస్టమర్లు ఉన్నారంట కదా?!!
మేనేజర్: అవును, డిపాజిటర్లంతా ఇండియాలో ఉంటారు. లోన్లు తీసుకునేవాళ్లంతా ఇండియా బయట ఉంటున్నారు!
గుర్తించలేదంతే!
స్టూడెంట్: సైలెంట్ లెటర్స్ ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయా, తెలుగులో ఉండవా మాస్టారూ…!
మాస్టారు: లేదు. తెలుగులో కూడా ఉంటాయి. ఉదాహరణకి కూతురిని అత్తారింటికి పంపే ముందు మామగారు, అల్లుడితో ‘బాబూ జాగ్రత్త’ అని అంటాడు. మధ్యలో ‘నువ్వు’ అనే రెండు పదాలూ సైలెంటేగా.
మీరు, నేను ఒకటే టీచర్!
టీచర్: రాజూ, ఎప్పుడూ ఏదో ఒక తప్పుచేసి క్లాసులో నిలబడి ఉంటావు, సిగ్గులేదా?
రాజు: లేదు, టీచర్.. క్లాసు మొత్తానికి మనిద్దరమే నిలబడి ఉంటామని గర్వంగా ఉంటుంది.
తగ్గించడమెలా?
స్వీటీ వాళ్ల టీచర్.. ఆమె ప్రొగ్రెస్ రిపోర్టులో ఇలా రాసింది… ”ఈ అమ్మాయి తెలివైనదే. కానీ, ఎక్కువగా మాట్లాడుతోంది. వాగుడు తగ్గించి పాఠాల మీద శ్రద్ధ పెడితే మంచి మార్కులు వస్తాయి. దీని కోసం మీరేదైనా మార్గం ఆలోచించాలి”.
స్వీటీ తండ్రి ఆ ప్రోగ్రెస్ కార్డుపై సంతకం పెట్టి.. ఆమె కామెంట్ కింద ఇలా రాశాడు… ”మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. వీళ్ల అమ్మ మీద ప్రయోగించాలి”