
పెద్దపల్లి జిల్లాకు సంబందించిన సమ్మర్ కోచింగ్ క్రీడాకారులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షణపల్లి జగన్ మోహన్ రావు అభినందించారు. ఏప్రిల్-20 నుండి మే-20 వరకు పెద్దపల్లి జిల్లాకి సంబంధించి సమ్మర్ కోచింగ్ క్యాంపు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన విషయం విదితమే. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభ ను వెలికి తీయడానికి ఈ క్యాంపులు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగమ రావు, క్యాంపు ఇంచార్జి డి కిరణ్ కుమార్ యాదవ్, కోచ్ ఎం సురేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.