
నవతెలంగాణ – రామగిరి
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించాలని గత కొన్ని రోజుల నుండి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాలు తిరుగుతూ, శనివారం మంథనిలో మంత్రి శ్రీదర్ బాబుతో మంథని ప్రజాప్రతినిధులతో ,కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు లడ్డు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ప్రచారం నిర్వహించి, అక్కడి వారితో ఇంటింటికి తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని ,మంత్రి ,మ్యానిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని,ఇండస్ట్రియల్ కారిడార్ ని ఏర్పాటు చేస్తామని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు, అర్హత గల లబ్దిదారులకి మాత్రమే పథకాలు అందేలా మంత్రి పార్లమెంట్ అభ్యర్థి కృషిచేస్తారని మాజీ జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు (లడ్డు) కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.