మండలంలో 29 వేల 358 మంది ఓటర్లు

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలంలో నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 12 గ్రామపంచాయతీల పరిధిలో 29 వేల 358 మంది తమ ఓటు హక్కున సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులు తెలియజేశారు. మండలంలో 14వేల  065 మంది పురుషులు, 152 మంది మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారని వారు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలకు పోలీస్ బలగాల మోహరింపు..

రెంజల్ మండలంలో సోమవారం జరిగే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని పోలీసు బలగాలను రప్పించినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపారు. మండలానికి డిఎస్పీ తో పాటు, సిఐ, ఇద్దరు ఎస్ఐలు, 30 మంది కేంద్ర బలగాలను, మరో 50 మంది రాష్ట్ర పోలీస్ బలగాలని మొహరింప చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాలలో కేంద్ర బలగాలను మొహరించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని రెంజల్ ఎస్సై ఈ. సాయన్న కోరారు.