హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. టోల్‌ ఫ్రీ నంబర్లు..

నవతెలంగాణ హైదరాబాద్‌: మరికొద్దిసేపటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షం కారణంగా తలెత్తిన ఇబ్బందులను టోల్‌ ఫ్రీ నంబర్లు 040 2111 1111, 90001 13667కు సమాచారం అందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.