ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్ఐ బి.లింగం

నవతెలంగాణ – తొగుట
మద్యం, డబ్బు, కూల్ డ్రింక్ బాటిల్స్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాను సారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బి. లింగం తెలిపారు. ఆదివారం తొగుట పోలీస్ స్టేష న్ పరిధిలోని కాన్గల్ గ్రామ శివారులో చింతమడక శ్రీధర్, తన వ్యవసాయ పొలం వద్ద ఒక షెడ్డులో అక్రమంగా స్ప్రైట్, థమ్సప్ బాటిల్లు దాచి పెట్టా రు. విషయం తెలుసుకున్న పోలీసులు నమ్మదగి న సమాచారంతో ఎస్ఐ, మండల్ (ఎఫ్ఎస్టి) ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అధికారులు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. షెడ్డులో ఓటర్లకు పంపిణీ చేయడానికి దాచిపెట్టిన స్ప్రైట్, థమ్సప్ బాటిల్లు 1.25 లీటర్లు కలవి 660 బాటిల్లు మొత్తం విలువ రూ. 38,940 వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇండ్లలో, హోట ల్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపితే, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశం లో వ్యవసాయ క్షేత్రాల వద్ద ఇతర ప్రదేశాలలో ఓట ర్లను ప్రభావితం చేయడానికి మద్యం బాటిల్లు, డబ్బు, కూల్ డ్రింక్ బాటిల్స్, దాచిపెట్టిన ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం కఠిన తప్పవన్నారు. ఓట ర్లకు పంపిణీ చేయడానికి ప్రయత్నించిన వెంటనే ఎలక్షన్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1950, సిద్దిపేట పోలీ స్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని సూచించారు. స్ప్రైట్, థమ్సప్ బాటిల్లు స్వాధీనం చేసుకుని కేసు నమో దు చేసి పరిశోధన ప్రారంభించామని తెలిపారు.