పోలింగ్ ను కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించాలి: కలెక్టర్

– పవర్ మేనేజ్మెంట్, మాక్ ఫోలింగ్, వెబ్ కాస్టింగ్ అంశాలపై దృష్టి సారించాలి
– ఈవీఎంల భద్రత కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సవ్యంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారులు అందరూ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల దాసరి చందన ఆదేశించారు. ఎక్కడ ఏలాంటి సంఘటనలు జరగకుండా నేటి  పార్లమెంట్ ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలన్ని కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పరివేక్షించాలని అన్నారు.వారికి కేటాయించిన విధులను ఏలాంటి నిర్లక్ష్యం లేకుండా నిర్వహించాలని, ముఖ్యంగా మాన్ పవర్ మేనేజ్మెంట్, మాక్ ఫోలింగ్, వెబ్ కాస్టింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.  ఈవీఎంల భద్రత కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు .ప్రతి రెండు గంటలకు ఒక సారి ఇచ్చే పోలింగ్ శాతం వివరాలు  అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా,సెక్టార్ల వారిగా  సేకరించి కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ శాతాన్ని తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. సెక్టోరల్  అధికారుల నంబర్లతో పాటు, ప్రతి పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న విషయాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా గమనించాలని అన్నారు.  నేడు  సాయంత్రం 6 గంటల నుండి అన్ని రూట్లు  ట్రాక్ చేయాలని, పోలైన ఈవీఎంలన్నీ  అనిశెట్టి దుప్పలపల్లి లోని స్ట్రాంగ్ రూమ్ కి వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అలాగే ఆశ, అంగన్వాడీల సహకారాన్ని తీసుకోవాలని,క్యూ ల  నిర్వహణ వంటి అంశాలలో పోలీసులకు సహకరించి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, రాత్రి మొత్తం తిరగాలని అన్నారు. వర్షం వచ్చిన పోలింగ్ కేంద్రాలలో ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దాలని, స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైనంత మంది హమాలీలను ముందే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.