– ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజిజ్
ఊట్కూర్: ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినిగించుకోవాలని ఎంపీజే రాష్ట్రఅధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అ న్నారు. మండల కేంద్రంలో ఎంపీజే ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఓటును వథా చేయకుండా ఓటు హక్కును విరిగించుకోవాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఓటు సెక్యులర్ ఉన్న వ్యక్తికి వేయాలని సూచించారు . 100శాతం ఓటును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర నాయకులు హమీదుద్దీన్ , సలీం , జిల్లా నాయకులు మన్సూర్ అలీ, షకీల్ , ఖాజీమ్ హుస్సేన్ తో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.