నవతెలంగాణ- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ శాసనసభ పరిధిలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల బాలుర జూనియర్ కళాశాల జడ్చర్ల లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిగ్రీ కళాశాల నుండి భారీ పోలీస్ భద్రత మధ్య పోలింగ్ సిబ్బంది తమ యంత్రాలను వెంటబెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన బస్సులలో తరలి వెళ్లారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మహబూబ్ నగర్ పట్టణం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఈ.వి.యం.,పొలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ జి.రవి నాయక్,ఎస్.పి.హర్ష వర్ధన్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్మహబూబ్ నగర్ పట్టణం లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల లో దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం కు సంబందించి పార్లమెంట్ ఎన్నికల పంపిణీ కేంద్రం లో పొలింగ్ సామగ్రి పంపిణీ ఏర్పాట్లు తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ జి.రవి.నాయక్ మాహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో దేవరకద్ర నియోజకవర్గం కు సంబంధించిన అన్ని అంశాలను దగ్గర్నుండి ఉన్నత అధికారులు పరిశీలించారు.